BRS: రేవంత్ రెడ్డికి అన్నం పెట్టెటప్పుడు మీరైనా చెప్పండి.. హరీష్ రావు సంచలన ట్వీట్

by Ramesh Goud |
BRS: రేవంత్ రెడ్డికి అన్నం పెట్టెటప్పుడు మీరైనా చెప్పండి.. హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డికి అన్నం పెడుతున్న వాళ్లకు దండం పెట్టి అడుగుతున్నానని, ఆయనకి మీరైనా చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) అన్నారు. ఇవాళ హరీష్ రావు సిద్దిపేట(Siddipeta) జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్(Parshanth Nagar Intigrated Govt Hostel) ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏడాది పాలనతో గురుకులాలు(Gurukulas), హాస్టళ్ళు(Hostels) అన్ని ఆగమైపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పాలనలో వేలాదిమంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులు పెట్టడం పెట్టడం మానేసి, పిల్లలకు అన్నం పెట్టాలని దుయ్యబట్టారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్లో ఆరు నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదని, బిల్లులు ఇవ్వకపోతే పిల్లలు మంచి భోజనం ఎలా చేయాలని ప్రశ్నించారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్లైనా గుర్తు చేయాలని వారికి దండం పెట్టి అడుగుతున్నానని అన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలు రాక కడుపు నిండా అన్నం తింటలేరు అని రేవంత్ రెడ్డికి మీరైనా జర చెప్పండి అని హరీష్ రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed