గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తే.. హాస్టల్ బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయి..?

by Kalyani |
గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తే.. హాస్టల్ బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయి..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన పై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను గురువారం రాత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులలో కాసేపు ముచ్చటించి సమస్యలపై ఆరా తీసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 49 మంది ముక్కు పచ్చలారని పసి బిడ్డలను పొట్టనా పెట్టుకుంది అని ఆరోపించారు. ఉత్సవాల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టడానికి చేతులు రావడం లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గురుకుల విద్యార్థుల గౌరవాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తున నిలిపితే.. నేటి సీఎం రేవంత్ రెడ్డి గురుకుల హాస్టల్స్ ను ఆగం చేశాడని మండిపడ్డారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాస్టల్స్ కు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారని. అదే నిజమైతే ఆరు నెలలుగా గురుకుల హాస్టల్ బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. వార్డెన్ లు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కాదని నిజానికి బిల్లులు పెండింగ్ లో పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాండూరు హాస్టల్ లో అనారోగ్యానికి గురైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరామర్శకు వెళుతున్న ఎమ్మెల్యే సుబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయని పక్షంలో మైనార్టీ గురుకుల పాఠశాలలకు తాళం వేసిన మాదిరే ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలకు తాళం వేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఫోర్ట సీటి, ఆయన భూముల వద్దకు సిక్స్ లైన్ రోడ్డు వేసుకోవడమే అన్నారు. తక్షణమే హాస్టల్ మెస్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed