- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ గణనను పకడ్బందీగా నిర్వహించాలి
దిశ, మేడ్చల్ బ్యూరో : వ్యవసాయ గణనను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ ముఖ్య ప్రణాళిక అధికారి వెల్నాటి శేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ అన్నారు. 11వ వ్యవసాయ గణనపై గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ, ప్రణాళిక సహాయక సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఉప గణాంక అధికారులు, విస్తీర్ణాధికారులు, మండల ప్రణాళిక, గణంక అధికారులతో వ్యవసాయ గణనపై వారు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ గణన 2021-22 సంవత్సరం రెండో దశలో 34 గ్రామాలు, 2022-23 సంవత్సరంలో మూడో దశలో 16 గ్రామాలలో నిర్వహిస్తున్నామని, ఈ వ్యవసాయ గణనను డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని, ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే నెంబర్ల వారీగా ఏఏ పంటలు వేస్తారు, సాగు నీటి పారుదల, వ్యవసాయదారులు ఉపయోగిస్తున్న పనిముట్లు, ఎరువులు, యాంత్రికరణ, ఇతర వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వ్యవసాయ గణన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వారు కోరారు. మాస్టర్ ట్రైనర్ ఉప గణాంక అధికారి బాలమణి, మండల ప్రణాళిక , గణంకాధికారి మాధవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.