- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం మాయం...
దిశ, మీర్ పేట్ : మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ నందనవనం ఎక్స్ రోడ్ లో శివాజీ జయంతి రోజున బీజేపీ నాయకులు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తొలగించారని బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళన చేశారు. విగ్రహం తొలగించిన వారి ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం విగ్రహం తొలగించిన వారిని కాకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జి అందరు శ్రీరాములు యాదవ్, బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ రాములు మాట్లాడుతూ హిందూ సమాజం పై కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా తొలగించిన దొంగ ఎవరో కనిపెట్టకుండా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహం తొలగింపు పై స్థానిక శాసనసభ్యులు జిల్లా మంత్రి ఏవిధంగా స్పందిస్తారో అని హిందుత్వానికి అనుకూలమా, వ్యతిరేకమా ? అనేది వేచి చూస్తామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి లోబడి పని చేస్తుందని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. విగ్రహం తొలగించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.