ఈ ఏడాది రూ.49815.36 కోట్ల రుణ ప్రణాళిక.. విడుదల చేసిన కలెక్టర్ శశాంక

by Aamani |
ఈ ఏడాది రూ.49815.36 కోట్ల రుణ ప్రణాళిక.. విడుదల చేసిన కలెక్టర్ శశాంక
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : 2024 - 2025 సంవత్సరానికి ఉద్దేశించిరూ. 49815.36 కోట్ల రుణాల లక్ష్యంతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ శశాంక విడుదల చేశారు. బ్యాంకర్లు నిర్దేశించిన రుణాల లక్ష్యాలను చేరుకోవాలని, బ్యాంకర్లు ప్రజలకు అందించే రుణాల్లో నిర్దేశిoచబడిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకులు తమ లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. జిల్లా క్రెడిట్ ప్లాన్‌ని రూ.49815.36 కోట్లతో గత సంవత్సరం కంటే రూ.25648.36 కోట్ల పెరుగుదలతో 28.17% వృద్ధిని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ. 6166.81 కోట్లు, ప్రాధాన్యతా రంగం నుండి రూ.15086.07 కోట్ల మేజర్ కాంపోనెంట్ ఏంఎస్ఏంఈకి కేటాయించబడిందని అన్నారు. మారుమూల ప్రాంతాలు మరియు బ్యాంకులు లేని గ్రామాలలో తగిన సంఖ్యలో బీసీ పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి అకౌంటు కు ఆధార్ కార్డు, పాన్ కార్డు యాడ్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

ఆపరేటివ్ ఖాతాల కోసం మొబైల్ నంబర్, పెన్షన్, రైతు బంధు, గ్యాస్ సబ్సిడీ, పీఎం కిసాన్, సమ్మాన్ నిధి వంటి డీబీటీ ప్రయోజనాలను పొందేందుకు లబ్ధిదారులకు సులభతరం చేయడానికి పీఎంజేజేబై, పీఎంబీవై బీమా పథకాల కింద ఖాతాదారులందరినీ కవర్ చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ బ్యాంకులు ఏపివై, ఎస్ఎస్వై ఖాతాలను తెరవాలని ఆదేశించారు. జిల్లాలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. వ్యవసాయ, ప్రాధాన్యత రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. జిల్లాలో ఆర్థిక సహాయ పథకాలను గ్రౌండింగ్ చేసి లక్ష్యాలను సాధించినందుకు బ్యాంకర్లు, సెక్టోరల్ హెడ్‌లు, డిర్డిఏ, డిఐసీ , సెర్ప్, మెప్మా అధికారులను ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కుసుమ, ఆర్.బీ.ఐ అధికారి, నాబార్డు ఎజిఎం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed