ప్కారెట్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో అషికా రంగనాథ్.. చంద్రుడైనా తలదించడా నీ చిరునవ్వుకి అంటూ కామెంట్స్

by Kavitha |
ప్కారెట్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో అషికా రంగనాథ్.. చంద్రుడైనా తలదించడా నీ చిరునవ్వుకి అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైనా ఈ భామ రీసెంట్‌గా నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్‌డమ్ అందుకుంది. అంతేకాక నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు మతిపోగోడుతుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ప్యారెట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని క్యూట్‌గా నవ్వుతూ ఫోటోలకి ఫోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు నీ చిరునవ్వుకి చంద్రుడైనా తలదించడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed