స్కూలుకెళ్లడానికి బైక్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య!

by Anjali |
స్కూలుకెళ్లడానికి బైక్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు తిట్టారనో, స్నేహితులతో గొడవలకు పాల్పడం వల్ల.. ఇలా పలు చిన్న చిన్న కారణాల వల్ల విద్యార్థులు ఏకంగా తల్లిదండ్రులను శోకసంద్రంలో నెట్టేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. రీసెంట్‌గా ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. తాజాగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన 14 ఏళ్ల మారు మణిదీప్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. మణిదీప్ పాఠశాలకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ కావాలని వాళ్ల అమ్మని అడిగాడు. బైక్ ఇస్తేనే స్కూలుకు వెళ్తానని మారం చేశారు. తల్లి ఎంతకు బైక్ ఇవ్వడం కుదరని తేల్చి చెప్పడంతో క్షణికావేశంలో మణిదీప్ గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని గడ్డిమందు తాగాడు. దీంతో మణిదీప్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణిదీప్ నిన్న(జులై 1) మృతిచెందాడు. మణిదీప్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇక ప్రస్తుత రోజుల్లో యువత చిన్నచిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం గంజాయి తీసుకోవడం కూడా ఓ కారణమంటున్నారు పలువురు జనాలు.

Next Story

Most Viewed