నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, కానీ అలా మాత్రం చేయొద్దు - పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్

by Kavitha |
నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, కానీ అలా మాత్రం చేయొద్దు - పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్
X

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటి నుంచి యూత్ బాగా ఓ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నది. దీనిలో భాగంగా బైక్లపై నెంబర్ ప్లేటుకు బదులు ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ రాయించుకొని తిరుగుతున్నారు. అయితే ఈ ధోరణిపై తాజాగా పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ నిన్న(జూలై 3) వారాహి సభ నిర్వహించారు. అందులో దీని గురించి మాట్లాడుతూ.. ఎవరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నంబర్ ప్లేట్ పెట్టుకోవద్దని.. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు అది తన మీదకి వస్తుందని సరదాగా అన్నారు.

కాబట్టి, యువత ఎవరైనా బైక్ రేసింగ్‌లు చేసుకోవాలనుకునే వారు తన రెండెకరాల స్థలంలో చేసుకోవచ్చని సూచించారు. కావాలంటే తన స్థలాన్ని రేసింగ్‌లకు అనుకూలంగా మార్చుతానని చెప్పారు. అందరికీ హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో అక్కడున్న జనం మొత్తం హోరెత్తేలా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Next Story