viral : కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఉద్యోగిని ట్రాన్స్‌ఫర్.. ఎక్కడికంటే..

by Javid Pasha |
viral : కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఉద్యోగిని ట్రాన్స్‌ఫర్.. ఎక్కడికంటే..
X

దిశ, ఫీచర్స్ : సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ అధికారిణి కుల్విందర్ సింగ్ కౌర్ చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన ఘటన కొన్ని వారాల క్రితం సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై దురుసుగా ప్రవర్తించినందుకుగాను సదరు అధికారిని కర్ణాటకకు బదిలీ చేశారన్న వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో వాస్తవం ఎంతనేది పక్కన పెడితే నెటిజన్లు ఈ విషయమై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు కుల్విందర్ సింగ్ కౌర్‌కు సపోర్టుగా స్పందిస్తుంటే.. మరి కొందరు కంగనాను వెనకేసుకొస్తున్నారు.

అయితే కొన్ని వారాల క్రితం సెలబ్రిటీలు ఓ పార్టీకి చెందిన నేతలు, అభిమానులు కంగనాకు మద్దతుగా, సీఐఎస్ఎఫ్ అధికారిణి కుల్విందర్‌సింగ్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. ఇదిలా ఉంటే మరికొందరు కంగనా రనౌత్ రైతులను కించపరిచే విధంగా మాట్లాడినందుకే కుల్విందర్ సింగ్ కౌర్ చెంప దెబ్బ కొట్టాల్సి వచ్చిందని ఆమెకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదంతా వివాదాస్పదం కావడంతో కంగనా రనౌత్ భద్రతా ఉల్లంఘన ఆరోపణలపై సీఐఎస్ఎఫ్ మహిళా సైనికురాలు కుల్విందర్ కౌర్‌ను అప్పట్లో జాబ్ నుంచి తొలగించారు. దీనికి సంబంధించి ఆమెపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తు పెండింగ్‌లో ఉంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు కుల్విందర్ కౌర్ సింగ్‌ను చంఢీగఢ్ విమానశ్రయం నుంచి బదిలీ చేశారని, ఆమెను బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సేవలు అందించేందుకు అక్కడికి పంపించారని, ఆమెతోపాటు ఆమె భర్తను కూడా బదిలీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయమై స్పందించిన సీఐఎస్ఎఫ్ అధికారిణి కుల్విందర్ కౌర్ ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసింది. తనను సస్పెండ్ చేసింది మాత్రం నిజమని పేర్కొన్నది. వాస్తవానికి ప్రస్తుతం కుల్విందర్ సింగ్ కౌర్‌పై విచారణ జరుగుతోంది కాబట్టి అది ముగిసే వరకు ఆమెను డ్యూటీలోకి తీసుకోవడం, బదిలి చేయడం వంటివి జరగవని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఆమె పదవిలో కొనసాగుతారా? బదలీ అవుతారా? తేలనుంది తప్ప ఇప్పట్లో ఓ స్పష్టత వచ్చే చాన్స్ లేదు.

Next Story