CM చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..?

by Anjali |
CM చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి సస్పెండ్ అయ్యారు. గతంలో చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. శాంతిపురం మండలం శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో చంద్రబాబు నాయుడు ఇల్లు నిర్మించేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు దరఖాస్తు చేశారు. దీంతో చంద్రబాబు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి దరఖాస్తు చేయాలని కోరగా.. డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1. 80 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు సమాచారం. పనులు ముందుకు సాగాలని తప్పనిపరిస్థితుల్లో డిప్యూటీ సర్వేయర్ అడిగిన మొత్తం లంచం ఇవ్వాల్సి వచ్చిందట. దీంతో చంద్రబాబు ఇల్లు నిర్మాణ పనులు ముందుకు సాగాయి.

ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. అయితే గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం టూరులో ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద టీడీపీ నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు దీనిపై ఆరా తీశారు. దీంతో డిప్యూటీ సర్వేయర్ తీసుకున్న లంచం బాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా దీనిపై సర్వే శాఖ ఏడీ గౌస్ భాషాతో విచారణ జరిపించగా డిప్యూటీ సర్వేయర్ తీసుకున్న లంచం నిజమని వెల్లడైంది. ఈ అంశాలపై నేడు సాయంత్రం కల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఏడీని ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story