అయోధ్యలో నీట మునిగిన రోడ్డు.. ఆరుగురు అధికారులపై వేటు

by Shamantha N |
అయోధ్యలో నీట మునిగిన రోడ్డు.. ఆరుగురు అధికారులపై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామపథ్ లో నీళ్లు నిలిచాయి. అయోధ్యలో కొత్తగా 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డుని నిర్మించారు. కాగా.. గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామ్ పథ్ లోని 15 బైలేన్ లు జలమయం అయ్యాయి. రోడ్డు పక్కనున్న ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ధ్వంసం అయ్యింది. దీంతో, ఆరుగురు ప్రభుత్వ అధికారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై వేటు వేసింది. ఈ వ్యహరంలో అహ్మదాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ భువన్ ఇన్‌ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రామ్ పథ్ నిర్మించిన కొద్దిసేపటికే దెబ్బతిందని పీడబ్ల్యూడీ ఉత్తర్వుల్లో పేర్కొంది. పనిలో అలసత్వం ప్రదర్శించి సామాన్య ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీశారని ఆరోపించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పీడబ్ల్యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ చౌహాన్ తెలిపారు.

ఉన్నతస్థాయి కమిటీ వేయాలన్న ఎంపీ

మరోవైపు, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ నాయకులతో కలిసి రామ్ పథ్, ప్రభుత్వాస్పత్రి సహా అయోధ్యలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇకపోతే, యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. రామ్ పథ్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది పెద్ద సమస్య అని.. రాముడి పేరుతో దోపిడి జరుగుతోందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో దీనిపై విచారణ జరపాలన్నారు.

Next Story

Most Viewed