- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో ఎంపీ మిథున్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో ఈ తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలతో పుంగనూరులో సమావేశం నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే గొడవలు చెలరేగే అవకాశం ఉండటంతో సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే సమావేశం నిర్వహించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మిథున్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న నేతలు, కార్యకర్తలను సైతం అనుమతించడంలేదు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు.
కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లారు. మరోవైపు ప్రత్యర్థులు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లలో ధైర్యం నింపడంతో పాటు మళ్లీ యాక్టివ్ అయ్యి కార్యక్రమాలు నిర్వహించేలా సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధినేత జగన్ ఆదేశించడంతో ఎంపీ మిథున్ రెడ్డి అడుగులు వేశారు. పుంగనూరులో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. దీంతో తిరుపతితో పాటు పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.