- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Welspun One: నవీ ముంబైలో రూ. 2,700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వెల్‌స్పన్ వన్..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ లాజిస్టిక్స్(Logistics), ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్(Industrial Real Estate) కంపెనీ వెల్‌స్పన్ వన్(Welspun One) 237.3 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ . 2,700 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. నవీ ముంబై(Navi Mumbai)లోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవు(Jawaharlal Nehru Port) పక్కన ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ) వద్ద లాజిస్టిక్స్ పార్క్(Park)ను విస్తరించడానికి ఈ నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా తొలుత రూ. 700 కోట్ల పెట్టుబడితో 12 లక్షల చదరపు అడుగుల పార్కుగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్‌లో పెరుగుతున్న రద్దీ కారణంగా 44.50 లక్షల స్క్వేర్ ఫీట్స్ కు పెంచాలని చూస్తోంది. మొత్తం 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్‌స్పన్ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 11 లాజిస్టిక్స్ పార్కులు ఉండగా ఒక మహారాష్ట్ర(MH)లోనే మూడు లాజిస్టిక్స్ పార్కులు ఉన్నాయి.