విషాదం.. ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు బాలురులు మృతి

by srinivas |
విషాదం.. ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు బాలురులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు బాలురులు మృతి చెందారు. మృతులు రాఘవ, సాయిచరణ్‌గా గుర్తించారు. దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులపై బంధువులకు సమాచారం అందించారు. బాలురుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. దీంతో వీరాయపాలెంలో విషాద చాయలు అలువుకున్నాయి. ఎంతో చలాకీగా కనిపించే బాలురులు ఇక లేరని తెలిసి గ్రామస్తులు సైతం కంట కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనతో బాలురుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో వారి ఏడుపును ఆపడం ఎవరితరం కావడం లేదు. ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed