Raghurama Krishnaraju: రఘురామ టార్చర్ కేసులో జీజీహెచ్ సిబ్బందికి నోటీసులు

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-05 02:04:18.0  )
Raghurama Krishnaraju: రఘురామ టార్చర్ కేసులో జీజీహెచ్ సిబ్బందికి నోటీసులు
X

దిశ, గుంటూరు: శాసనసభ డిప్యూటీ స్పీకర్(Dy Speaker) రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) హింసించిన కేసులో గుంటూరు జనరల్ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు సిబ్బందికి ఒంగోలు పోలీసులు బుధవారం నోటీసులు అందించారు. సీఎస్ ఆర్ఎంఓ సతీశ్(Sathish), అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర(Rajendra), ఈసీజీ టెక్నీషియన్ నాగరాజు(Nagaraju) గురువారం విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

గత వైసీపీ పాలనలో అప్పటి సీఐడీ పోలీసులు టార్చర్ చేసినట్లు రఘురామ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు లేవని అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి(Prabhavati) సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే.. ఆనాడు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయనకు గాయాలు ఉన్నట్టు తేలడంతో రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రభావతి కోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సిబ్బందికి నోటీసులివ్వడంతో, ఇంకెంతమంది ఈ కేసులో ఇరుక్కుంటారో అని జీజీహెచ్‌లో చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed