7 నిమిషాల కోసం కమల్ హాసన్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

by Prasanna |
7 నిమిషాల కోసం కమల్ హాసన్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
X

దిశ, సినిమా : ‘కల్కి 2898 AD’ మూవీ విడుదలైన రోజే నుంచే హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఈ మూవీలో ఎవరూ ఊహించలేని విధంగా సర్ ప్రైజ్ లు, ట్విస్ట్ లు ఉన్నాయి. ఇవే ఈ మూవీ హిట్ అవ్వడానికి కారణమయ్యాయి. కల్కి మూవీలో చాలా మంది నటీ నటులు మెరిశారు . ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ అయితే నట విశ్వరూపం చూపించారు.

నాలుగేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. దేశ మంతటా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో నటించిన నటీ నటులు పాపులారిటీతో పాటు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారని సమాచారం. ముఖ్యంగా, కమల్ హాసన్ కల్కి మూవీలో కొద్దీ సేపు మాత్రమే దర్శనమిచ్చారు. దాని కోసం కోట్లలో పారితోషికం పుచ్చుకున్నాడు.

మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్ర చిన్నది, విలన్ రోల్ అయినప్పటికీ ఏ మాత్రం ఆలోచించకుండా.. అంగీకరించడం విశేషం. కల్కి 2898 AD చిత్రంలో కమల్ హాసన్ పాత్రకు 20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం 7 నిమిషాల 4 సెకన్లు పాత్ర కోసం ఇన్ని కోట్లు ఇచ్చారా.. అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. 40 శాతం మాత్రమే మిగిలి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story

Most Viewed