సరైన పార్టనర్ దొరికితేనే అబ్బాయి మగాడు అవుతాడు..విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్

by Jakkula Samataha |
సరైన పార్టనర్ దొరికితేనే అబ్బాయి మగాడు అవుతాడు..విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో చాలా బిజీ అయిపోయింది. అయితే తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా త్వరలోనే వారు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

లవ్ స్టోరీ 2 షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇక తమన్నాకు విజయ్ అంటే అమితమైన ఇష్టం. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే తనను పొగిడేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

విజయ్ వర్మ తాజాగా మీర్జాపూర్ 3 వెబ్ సీరిస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇది త్వరలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్రమోషన్స్‌లో పాల్గొని, పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీరిస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మనం మన పార్టనర్స్ నుంచి చాలా వరకు నేర్చుకుంటాం. ముఖ్యంగా సెక్స్వల్‌గా ప్రతీది మనకి మనము తెలుసుకోలేము, సరైన ఎనర్జీ ఉన్న పార్టనర్ కలినప్పుడు మాత్రమే అబ్బాయి మగవాడుగా మారుతారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నీ సరైన పార్టనర్ తమన్నానేగా.. తన నుంచి ఏం నేర్చుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed