- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాలల్లో కిచెన్ షెడ్లు కరువు.. ఇబ్బందులు పడుతున్న వంట ఏజెన్సీలు
దిశ,నందిగామ : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి మహిళలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ మండలం లో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 03, ప్రాథమికోన్నత పాఠశాలలు 28 ప్రాథమిక పాఠశాల లు ఉన్నాయి. అందులో సగానికి పైగా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు. ఫలితంగా వర్షాకాలంలో వంట చేసి వండి పెట్టడానికి మహిళలు నానా ఆగ చాట్లు పడుతున్నారు. చాలా చోట్ల పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లు లేకపోవడంతో వంట చెరుకు పైనే ఆధారపడి వంట చేస్తున్నారు. ఇటు కిచెన్ షెడ్డు లేక అటు వర్షానికి కట్టెలు తడిసి వందలాది మంది విద్యార్థులకు భోజనం వండి పెట్టడానికి మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి, కార్యక్రమం కింద మండలంలో 3 ప్రాథమిక పాఠశాలలు నర్సప్పగూడ, చేగూరు, మజీద్ మామిడిపల్లి పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ప్రకటించగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టినప్పటికీ అనేక చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్యూ లేకపోవడంతో కొన్ని ఇరుకు గదిలో వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం వస్తే వంట చేయడానికి మహిళలు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. వర్షాకాలంలో వంట చేయడానికి పెద్ద తంటా గా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాలల్లో కిచెన్ షెడ్లు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఇబ్బందుల ను తొలగించాలని వంట ఏజెన్సీలు కోరుతున్నారు.
ఈ గోస ఎప్పుడు తీరుతుందో : నీలమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు చేగూర్
మధ్యాహ్న భోజనం వండి పెట్టడం కోసం వర్షాకాలం లో కట్టెలు తడిసి మండకపోవడం మరోవైపు కిచెన్ షెడ్యూల్ లేకపోవడంతో వంట చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని ఎప్పుడు ఈ గోస తీరుతుందోనని వంట ఏజెన్సీ నిర్వాహకురాలు నీలమ్మ వాపోయారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కిషన్ షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.