- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆకాశమే హద్దుగా యువతకు అవకాశాలు: మంత్రి శ్రీధర్ బాబు
దిశ, బడంగ్ పేట్ : గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పేస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆకాశమే హద్దుగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్, వైమానిక రంగాల్లో ఎదిగేందుకు అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలోని హార్డ్ వేర్ పార్క్ లో రఘువంశీ ఏరోస్పెస్ తయారీ యూనిట్ కేంద్రానికి నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కే ఎల్ ఆర్ మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలో హార్డ్ వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, ఫోర్త్ సిటీ అనేక అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయని, అందువల్ల స్థానిక యువతీయువకులకు బోలెడన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కంపెనీలకు తగినట్లు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని సూచించారు.
రఘువంశీ ఏరోస్పేస్ ను 20 ఏళ్ల క్రితం 10 మంది ఉద్యోగులతో తన తండ్రి ప్రారంభించారని, నేడు 2000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా ఎదగటం గర్వంగా ఉందని చైర్మన్ రఘువంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో TSIIC ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరోస్పేస్,డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డి ఆర్ డి ఓ శాస్త్రవేత్త యు. రాజబాబు, భారత్ బయోటిక్ CII & ED చైర్మన్ సాయి ప్రసాద్ సహా కాంగ్రెస్ నాయకులు ఏనుగు జంగారెడ్డి, కృష్ణానాయక్, మదన్ పాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆదిళ్ల జంగయ్య, భాస్కర్ రెడ్డి, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.