- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అడ్డుకున్న తండా వాసులు..పరిస్థితి ఉద్రిక్తం
దిశ, బొంరాస్ పేట్: దుద్యాల మండలంలోని లగ చర్ల గ్రామంలో కంపెనీల (ఫార్మా) ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నారు.ఈ సందర్భంగా,భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు సబ్ కలెక్టర్,ఇతర అధికారులు శుక్రవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశానికి వెళ్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుటి శేఖర్ ను రోటి బండ తండావాసులు అడ్డగించి,దాడి చేయడానికి ప్రయత్నించారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి,ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది.రైతులతో వికారాబాద్,జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్,ఎస్పీ నారాయణరెడ్డి, తాసిల్దార్ వెంకటేశ్ ప్రసాద్,ఇతర అధికారులు చర్చిస్తున్నారు.దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవిటి శేఖర్ కారుపై దాడి చేసి,ఆయన పై చేయి చేసుకోవడంతో, పరిస్థితి ఉధృతంగా తయారైంది.