విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించాలి : జిల్లా కలెక్టర్ శశాంక

by Aamani |
విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించాలి :  జిల్లా కలెక్టర్ శశాంక
X

దిశ,రంగారెడ్డి బ్యూరో : విద్యార్థుల సమస్యల పై తక్షణమే స్పందించాలని విద్యాశాఖ అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ, పాఠశాలల మర్మమతులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ, పట్టణ, మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ఒక జత యూనిఫామ్స్ అందించడం జరిగిందని, రెండో జత యూనిఫామ్స్ త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని పిడి డీఆర్డీఏను ఆదేశించారు.

ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులైన తాగునీరు సౌకర్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, తరగతి గదులలో చేపట్టవలసిన మరమ్మతులు, విద్యార్థులు ఆడుకునే ఆట స్థలములలో కావలసిన వసతులు కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో వసతులు చేపట్టడానికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీర్లకు, జిల్లా విద్యాశాఖ అధికారికి, ఎంఈఓలకు, సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఈఈ పిఆర్ ఇంజనీర్ అధికారులు, ఎంఈఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed