Clinics seized : ఆరుగురు ఆర్ఎంపీలు అరెస్ట్….క్లినిక్​ లు సీజ్

by Kalyani |   ( Updated:2024-10-26 14:40:26.0  )
Clinics seized : ఆరుగురు ఆర్ఎంపీలు అరెస్ట్….క్లినిక్​ లు సీజ్
X

దిశ, పరిగి : ఆర్​ఎంపీ అంతకన్నా తక్కువ విద్యా అర్హత కలిగి ఏకంగా ఎంబీబీఎస్​ డాక్టర్లను మించి పోయారంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ సభ్యులు శనివారం పరిగిలోని రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, పల్లవి క్లినిక్, చిన్నారి లను తనిఖీ చేశారు. మీరంతా ఎంబీబీఎస్​ చదివారా అంటూ ప్రశ్నించారు. ఇందుకు తెల్లమొహం వేసిన క్లినిక్​ యజమానులు మౌనంగా ఉన్నారు. విద్యా అర్హత లేకుండా ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్ ఎం ఎల్ యాక్ట్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి ఎఫ్​ ఐ ఆర్​ తయారు చేస్తామని మందలించారు. ఎంబీబీఎస్​ చదివిన వారు కూడా ఇలా ఒక్కో క్లినిక్ లో 8 నుంచి 10 బెడ్లు వేసి క్లినిక్లు నడిపించేందుకు జంకుతున్న మీరు మాత్రం ఏకంగా క్లస్టర్​ దవాఖాలను మించి పోయారని మండి పడ్డారు.

తనిఖీ చేసిన ఐదు క్లినిక్ లకు డీఎంఅండ్​ హెచ్​ ఓ అనుమతి ఫార్మసీ పర్మిషన్ లేకుండా క్లినిక్ లు నడుపుతారా అంటూ ప్రశ్నించారు. బయో మెడికల్ వేస్టేజీ డిస్పోస్ చేయాలి, డిస్పోస్ చేయకుండా మున్సిపల్ వాహనంలో బయో మెడికల్ వేస్టేజ్ ని వేసి పంపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవి యాంటీబయాటిక్ వాడి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారన్నారు. రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, పల్లవి క్లినిక్ ల సీజ్​ చేసి, నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తాం మని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యం అందిస్తున్న 300కు పైగా క్లినిక్లను సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50 కి పైగా కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed