పశువుల సంత.. వసతుల్లేక చింత..

by Aamani |
పశువుల సంత.. వసతుల్లేక చింత..
X

దిశ, యాచారం: ప్రతి ఏడు పశువుల సంతకు రికార్డు స్థాయిలో ఆదాయం వస్తున్న ప్రభుత్వాల పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలు తిష్ట వేశాయి. కనీస వసతులు లేకపోవడంతో కొనుగోలు దారులు, అమ్మకం దారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాల్, పశువుల సంతకు 35 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. రంగారెడ్డి నల్లగొండ జిల్లాల సరిహద్దున ఉండడంతో చుట్టుపక్కల మండలాలైన మర్రిగూడ, చింతపల్లి, ఆమన్ గల్, కడ్తాల్, కందుకూరు, మండలాల ప్రజలే కాక మాచర్ల, గుంటూరు, హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ పశువుల సంతలో పశువులను అమ్మేందుకు కొనేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. తమ వ్యాపార లావాదేవీలను జోరుగా సాగిస్తూ ఉంటారు. వందల సంఖ్యలో పాడి ఆవులు, గేదెలు, కాడెద్దులు, గొర్రెలు, మేకలు, దున్నలు, క్రియ విక్రయాలు జోరుగా సాగుతుండడంతోరూ. 2 లక్షల నుంచి మొదలైన వేలం పాట నేడు రూ.75 లక్షలకు చేరిందంటే ఈ సంత గొప్పతనాన్ని తెలియజేస్తోంది. ఈ సంత ద్వారా ఎంతో మంది వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు.

స్థలం లేక ప్రైవేటు వెంచర్లో నిర్వహణ..

మంచి ఆదాయ వనరుగా నిలుస్తున్న పశువుల సంతకు సొంత స్థలం లేదు ప్రభుత్వాలు పాలకులు మారుతున్న వాగ్దానాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పశువుల సంతకు స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed