- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sabitha Indra Reddy : నిధులు అడ్డుకోవడం వల్లే అస్తవ్యస్తంగా మారిన నబీల్ కాలనీ
దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబీల్ కాలనీలో నిలిపివేసిన ఎస్ఎన్డిపి నాలా నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌తో పాటు జల్ పల్లి మున్సిపాలిటీ అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబీల్ కాలనీలో ఎస్ ఎన్ డి పి నాలా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబీల్ కాలనీలో ఎస్ ఎన్ డీపీ నాలా పనులు నిలిచి పోవడం కారణంగానే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మండి పడ్డారు.
అసలు ఎందుకు పనులు నిలిపి వేశారని కాంట్రాక్టర్‌ను ఆరాతీశారు. తనకు రావాల్సిన బిల్లు ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఎస్ఎన్ డిపి నాలా పనులు నిలిపివేశానని కాంట్రాక్టర్ చెప్పడంతో ఎస్ ఎన్ డిపి నాలా నిధులను అడ్డుకోవడం ఏంటని ? ప్రశ్నించారు. నబీల్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయని, ఇక్కడి స్థానికులు ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. నిలిపివేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ డి పి అధికారులు, జల్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, మున్సిపల్ కమిషనర్ వాణి తదితరులు పాల్గొన్నారు.