- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెత్తకుప్పలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. రాత్రైతే అంతా అక్కడే..!
దిశ, తాండూర్ పట్టణం: తాండూరు పట్టణంలోని రైతు బజార్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. రైతు బజార్‌లో మందుబాబులు మధ్యాహ్నం నుంచే అర్ధరాత్రి వరకు మద్యం తాగి, ఆ సీసాలను ఇష్టం వచ్చినట్లు పగులగొట్టి వెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు కూడా రైతు బజార్ అడ్డాగా మారింది. గతంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని, మూడు, నాలుగు నెలలు పూర్తి చేస్తామని తెలిపారు. కానీ ఉన్న రైతు బజార్ కాస్త అసౌకర్యంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. మంత్రి హరీశ్ రావు ప్రారంభించిన శిలాఫలకంపై ఉన్న నేమ్ ప్లేట్లును కూడా అక్కడి నుంచి పోకిరీలు తొలగించారు. రైతు బజార్‌ను వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా మార్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలనుకున్న ఆశయం నెరవేరకపోగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పిల్లర్లు వేసినా అవి మధ్యలో ఆగిపోయాయి.
అనంతరం నిర్మాణ పనులు ఆగిపోవడంతో పిచ్చి మొక్కలు, చెట్లు పెద్ద ఎత్తున పెరిగాయి. పోకిరీలు ఉన్న గోదాముల తలుపులు, కిటికీలు అన్ని పగలగొట్టడంతో రాత్రిపూట భయానక వాతావరణం కనిపిస్తున్నది. రైతు బజార్ ఉన్నప్పుడే కాస్త బాగుండేదని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా మారుస్తామని పనులు ప్రాథమిక దశలో ఉండడంపై అసౌకర్యంగా మారిందని స్థానికులు అంటున్నారు. తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న రైతుబజార్ చీకటైతే చాలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రాత్రి అయితే మందుబాబులు చిందులు వేయడం షరామామూలే. అంతేకాకుండా వాహనాలకు పార్కింగ్‌గా మారింది. అక్కడ ఉన్న హార్టికల్చర్ అండ్ సెరీకల్చర్ కార్యాలయం ఎప్పుడు చూసినా మూతపడే ఉంటుంది. షెడ్డు కింద ఒకప్పుడు కూరగాయల అమ్మకాలు జరిగేవి.
కానీ ఆ ప్రాంతంలో ప్రస్తుతం కొట్లాటలు, పంచాయతీలు, ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఉన్న గోదాముల గోడలకు పెద్దపెద్ద గోతులు ఉండడంతో అందులో మందుబాబులకు సౌకర్యవంతంగా మారింది. గోదాముల్లో మలవిసర్జన చేయడంతో దుర్గంధం వెదజల్లుతున్నది. సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, నీటి బాటిల్లు, చెత్తాచెదారం కూడా అక్కడే ఉండడంతో కొంత భాగం మురికికూపంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తుల సంచారంతో ఆ ప్రాంతంలో పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌పై దృష్టి సారిస్తారా? లేక వదిలిపెడతారా? వేచి చూడాల్సిందే. ఇంకా అనుకోని సంఘటనలు జరిగితే కానీ నాయకులు, అధికారులు స్పందించరా? అని పరిసర ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు.