- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటా : డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
దిశ, పరిగి : సంపాదించే పైసాలో కొంత ప్రజలకు సేవ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంగీకరించి, ఆదేశిస్తే ఎలాంటి పదవైనా, సేవ అయినా ప్రజల ఆశీర్వాదంతో చేస్తూ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువవుతానని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలోని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోవిందాపురం అశోక్ వర్ధన్ రెడ్డి ఫాంహౌజ్ లో శనివారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యా భారం కాకుండా పదవతరగతి విద్యార్థులు మారిన సిలబస్ ప్రకారం స్టడీ మెటీరియల్ అందించానన్నారు. ఈ స్టడీ మెటీరియల్ కార్యక్రమాన్ని కొందరు గిట్టని వారు స్వలాభం, రాజకీయ లబ్ది కోసం అంటూ నోరు పారేసుకోవడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తెలివిలేని పనే అన్నారు.
సేవా కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడం వారి విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. మరో సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రజలకు చేరువవుతూ నోరు పారేసుకున్న వారికి గట్టిగా బుద్ది చెబుతామన్నారు. స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. సహకార బ్యాంకుల్లో అంతా ఆల్ లైన్ సిష్టం తీసుకువచ్చి రైతులకు రుణాలు మరింత ఈజీగా అందించేందకు కృషి చేశానన్నారు. అనంతరం పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పదవులు ఆశించి భంగపడి నిరాసలో ఉన్న వారిని మనోహర్ రెడ్డి ఆక్సిజన్ అందిస్తూ అండగా ఉంటున్నారన్నారు. నిస్వార్థంగా పేదప్రలజకు సేవచేసుకుంటూ పార్టీ అభివృద్దికి కృషి చేస్తూ పోతే అధిష్టానమే గుర్తింపునిస్తుందన్నారు.
అదే నమ్మకంతో బీఎంఆర్ ఫౌండేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విద్యా, ఉద్యోగ పరంగా మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజలు, యువకులు, ఓటర్ల కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని, అభివృద్ది ఎక్కువగా చేసేందుకు అవకాశం ఉంటుందని ఎదురు చూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ రాంచెంద్రయ్య, పోతిరెడ్డిపల్లి బాబు, గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య, కుల్కచర్ల చర్ల జెడ్పీటీసీ రాందాస్, నాగరాజు పాలాది శ్రీనివాస్ గుప్త,కనకం మొగులయ్య, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్ రామకృష్ణారెడ్డి, చిల్కమర్రి వెంకటయ్య, కనకం మొగులయ్య, నరసింహారెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.