- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ లో నూతనోత్సాహం..
దిశ, తలకొండపల్లి : విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినట్లుగా తొలి సంతకం చేయడంతో మండలంలోని అధికార పార్టీ నేతలు సంబరాలను అంబరాన్ని అంటే విధంగా, కన్నుల విందుగా జరుపుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలని ఆసక్తితో ప్రజలందరూ టీవీల ముందు ఎదురుచూడడం విశేషం.
మండలంలోని మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్, పార్టీ అధ్యక్షులు కుమ్మరి శంకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలను జరుపుకుంటూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం నేతలు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, అభిమానులు బాణా సంచాలతో పల్లెలన్నీ మారుమోగాయి. అనంతరం నేతలు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను ఛేదించుకుంటూ, కేసీఆర్ తనదైన శైలిలో అడుగులు ముందుకు వేస్తూ 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణను తీసుకొచ్చాడని వారు కొనియాడారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వారు విమర్శించారు. దక్షిణ భారతదేశం నుండి ఒక తెలుగువాడు భారత జాతి మొత్తం గర్వపడే విధంగా తెలుగుజాతిని దేశం మొత్తం గుర్తుంచే విధంగా చేయడం ఎంతో శుభసూచకమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు పోరాట పటిమకు పెట్టింది పేరని, కేసీఆర్ అనుకున్నది సాధించి తీరుతాడని, రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యాన్మయం బీఆర్ఎస్ అని వారు గంటపదంగా పేర్కొంటున్నారు.