మణికొండ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఆగ్రహం

by Aamani |
మణికొండ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఆగ్రహం
X

దిశ, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. చేపట్టే అభివృద్ధి పనుల్లో పర్యవేక్షణ లేక పనులు పూర్తి కాగానే కుంగు బాట్లకు కూలిపోవడానికి గురవుతున్నాయి. ఇంత నిర్లక్ష్య ధోరణి అధికారులకు సరికాదని ప్రజల సైతం మండిపడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అవుతున్నప్పటికీ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కోసం టెండర్లను పిలిచి కోట్లను కేటాయించి పనులను చేపట్టే క్రమంలో మున్సిపల్ సిబ్బంది పనులను పర్యవేక్షించకుండా చోద్యం చూస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో నాణ్యతలేని రోడ్లను వేశారు. అయితే ఇప్పటికీ ఈ రోడ్డును మూడు సార్లు వేస్తే మూడు సార్లు కుంగిపోవడం విశేషం. అంతేకాకుండా ఈ రోడ్డు ఈ నెలలోనే రెండుసార్లు వేయడం అది కుంగిపోవడం మరో విశేషం.

ఇంత నిర్లక్ష్యం ఎక్కడ చూడలేదని ప్రజల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తమ గోడును వినిపించాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు సైతం ప్రజలు చేశారు. అయినా ఈ రోడ్డు మాత్రం ఇలాగే కుంగుబాటుకు గురవుతుండడం గమనార్హం. అధికారులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తో నిరంతరం చర్చిస్తూ పనులను పర్యవేక్షణ చేసి ఉంటే మున్సిపాలిటీలో ఇలాంటి కుంగుబాట్లు జరిగేవా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోడ్డును ఎందుకు ఇంత అధ్వానంగా నిర్మిస్తున్నారని, ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రణాళికతో నాణ్యమైన రోడ్డును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

పర్యవేక్షణ లోపమేనా..?

మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకటికి మూడు సార్లు నిర్మాణం చేపట్టిన నిర్మించిన రోడ్డు కుంగుబాటుకు గురి కావడమే ఇందుకు కారణం అంటూ స్థానికులు తెలుపుతున్నారు. అధికారులు కాంట్రాక్ట్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం కాంట్రాక్టర్ తో పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు నిర్మాణాన్ని పరిశీలించాల్సి వస్తుంది. కానీ ఇవేమీ చేయకుండా ఇష్టానికి వదిలేయడంతో కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టి చేతులు దులుపుకున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. అయితే కోట్లల్లో వెచ్చించి చేపట్టే అభివృద్ధి పనుల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని స్థానికులు గట్టిగానే చెబుతున్నారు. లక్షల్లో పనులను వసూలు చేసేది ఇందుకేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకొని పర్యవేక్షణ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed