రూ. 4.22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
రూ. 4.22  కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14 ,1, 20, 21, 23, 28, 29, 30, 32 డివిజన్ లలో నాలుగు కోట్ల 22 లక్షల రూపాయల నిధులతో నిర్మితమవుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటి మేయర్ ఇబ్రామ్ శేఖర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

మంత్రి ప్రోటో కాల్ పాటించలేదని తప్పు పట్టిన మేయర్..

ముందుగా వెంకటాపూర్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేయర్ రాకముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిచడాన్ని మేయర్ తప్పుబట్టారు. చివరగా 29 వ వార్డులో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి సబితా సమయానికి చేరుకుంది. సమయానుసారం మేయర్ 29 వార్డులో ప్రారంభోత్సవానికి చేరుకోక పోవడంతో తాను ఎలిమినేడు గ్రామంలో జరుగనున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి దిశ దినకర్మ కు ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరువుతున్నారని, తాను కూడ ప్రోటో కాల్ ప్రకారం అక్కడికి వెళ్ళేది ఉందని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో తాను రాకముందే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని మేయర్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. మున్సిపల్ బడ్జెట్ లో మంత్రి పెత్తనమేంటని..? కాస్త ఆలస్యమయితే పరదలు లాగడం ఏంటని..? ప్రశ్నించారు. మంత్రి ఆలస్యంగా వస్తే తాను కూడా చాలా సార్లు ఎదురు చూశానని అవి ఎందుకు పరిగణలోకి తీసుకోరని మేయర్ స్థానిక కార్పొరేటర్ లను నిలదీశారు. కనీసం ప్రోటో కాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. అప్పటికే మంత్రి వెళ్లిపోయారు.

ముందుగా మేయర్ సమయ పాలన పాటించాలి..

మీడియా ముఖంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి మంత్రిని విమర్శించడాన్ని డిప్యూటీ మేయర్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ లు ఖండించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం పెద్ద బావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటి మేయర్ ఇబ్రామ్ శేఖర్, కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేటర్ లు సూర్ణగంటి అర్జున్, స్వప్న జంగారెడ్డి, లిక్కి మమతా కృష్ణా రెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓ మంత్రి గా సమయపాలన పాటిస్తే.. ఓ మేయర్ గా చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి ఎందుకు సమయపాలన పాటించడం లేదని ప్రశ్నించారు. అసలు మీ సమస్య ఏంటని మేయర్ ను ప్రశ్నించారు..? చీటికి మాటికీ ఎందుకు అసహనానికి గురవుతున్నారని సమయానుసారం వస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని హితవు పలికారు. డిప్యూటీ మేయర్ లేకముందు మేయర్ ఎందుకు ప్రారంభోత్సవాలు చేశారు? ఆ నాడు ఎందుకు గుర్తు రాలేదని మేయర్ ను ప్రశ్నించారు?

Advertisement

Next Story

Most Viewed