Shocking Incident : బీరు సీసాలో బల్లి అవశేషాలు

by M.Rajitha |
Shocking Incident : బీరు సీసాలో బల్లి అవశేషాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సాయంత్రం సరదాగా మందు పార్టీ చేసుకుందాం అనుకున్న ఇద్దరు ఫ్రెండ్స్ కు భారీ షాక్ తగిలింది. తాము కొన్న బీర్(beer) బాటిల్లో చనిపోయిన బల్లి అవశేషాలు రావడంతో కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ పార్టీ చేసుకోవడానికి ఓ వైన్‌ షాపు నుంచి బీర్లతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన మందును తీసుకున్నారు. తీరా పార్టీ చేసుకుందామని బీరు బాటిల్‌ ఓపెన్‌ చేయబోతే అందులో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో షాకైన వారు ఇరువురు.. వెంటనే తమకు మందు అమ్మిన వైన్‌ షాపునకు వెళ్ళి నిలదీశారు. సదరు వైన్‌ షాపు యజమాని కంపెనీ నుంచే అలా వచ్చి ఉంటుంది.. మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో లక్ష్మీకాంత్‌ రెడ్డి బీర్‌ బాటిల్‌ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. మందుబాబులు తిట్లతో విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వీరల అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed