సాధన కాలనీలో అన్నీ సమస్యలే

by Sridhar Babu |
సాధన కాలనీలో అన్నీ సమస్యలే
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమములలో గల సాధన కాలనీ సమస్యలతో సతమతమవుతోంది. కనీస సౌకర్యాలు లేవు. మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో గల సాధన కాలనీకి వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడవడానికి వీలు లేకుండా చిన్నచినుకు పడితేనే చిత్తడి అయ్యే విధంగా రోడ్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. స్కూల్ విద్యార్థులు కూడా పెద్ద పెద్ద బ్యాగులతో

బస్సులెక్కేందుకు రోడ్లపై వెళ్తుంటే నడవలేని పరిస్థితి ఉందని వివరించారు. వీటికి తోడు కాలనీలో కుక్కలు సైతం ఎక్కువయ్యాయని తెలిపారు. స్థానిక కౌన్సిలర్లు తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రధాన రోడ్ లోనైనా కనీసం సీసీ రోడ్డు వేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి త్వరలో వివరించనున్నట్లు కాలనీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.



Next Story

Most Viewed