Donald Trump : మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఉద్రిక్తతలు సాగుతున్నాయి

by Shamantha N |
Donald Trump : మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఉద్రిక్తతలు సాగుతున్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఉద్రిక్తలు సాగుతున్నాయని హెచ్చరించారు. ‘పశ్చిమాసియాలో ఉద్రిక్తలు చల్లార్చేందుకు మా కోసం ఎవరు చర్చలు జరుపుతున్నారు? బాంబులు అన్ని చోట్ల పడుతున్నాయి. కాలిఫోర్నియాలోని బీచ్‌లో స్లీపీ జో నిద్రిస్తున్నారు. డెమొక్రాట్లు బైడెన్ ను దారుణంగా బరిష్కరించారు. కామ్రేడ్ కమలా.. టాంపోన్ టిమ్‌తో కలిసి అమెరికా వ్యాప్తంగా ప్రచారం పేరుతో బస్సు యాత్ర చేస్తోంది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ చెత్త ఎంపిక. మూడో ప్రపంచ యుద్ధం దిశగా మనం వెళ్తున్నాం. కానీ అది తగదు’ అని ట్రంప్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.

లెబనాన్- ఇజ్రాయర్ పరస్పర దాడులు

ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరపడానికి అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ సిక్యూ బ్రౌన్ పశ్చిమాసియాలో పర్యటన ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కరోజుకే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో, హెజ్‌బొల్లా వందలసంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో, అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా యుద్ధ నౌకలు పంపింది. ఈ దాడుల వల్ల ఇరాన్ సహా ఇతర మిలిటెంట్లు గ్రూపులు కూడా అప్రమత్తమయ్యాయి. వీటిపైనే ట్రంప్ స్పందించారు.

Next Story

Most Viewed