Collector : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

by Kalyani |
Collector : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
X

దిశ,వనపర్తి : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల,కే.జి.బి.వి పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల అధికారులు,ఆర్.సి. ఒ,లు, డి.సి. ఒ లు, వైద్య శాఖ అధికారులు, ఆర్.బి.ఎస్.కె అధికారులు, ప్రిన్సిపాల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యార్థులు కీటక జనిత వ్యాధుల బారిన పడకుండా అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో పని చేసే వంట మనిషి ఇతర సిబ్బందికి ఖచ్చితంగా వైడల్ పరీక్షలు నిర్వహించాలని, వారి ద్వారా పిల్లలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు.

ఆర్.బి.ఎస్.కే ద్వారా వసతి గృహాలు, గురుకులాలు, కే.జి.బి.లో విద్యార్థినులకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయాలని,రక్తహీనత బాధపడే విద్యార్థినిలను గుర్తించి మందులు ఇవ్వాలన్నారు.వసతి గృహాలలో విద్యార్థులతో మెస్ కమిటీ ఏర్పాటు చేసి,ద్వారా సంతకాలు తీసుకోవాలని సూచించారు.మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి.ఈ.ఒ గోవిందరాజులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జయచంద్ర మోహన్, ఆర్డీఓ పద్మావతి,షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఆర్.సి. ఒ లు, డి.సి. ఒ లు, వసతి గృహాల ప్రిన్సిపాల్ ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story