- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
దిశ, ఖానాపూర్ : ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం కింద మంజూరైన గ్యాస్ సబ్సిడీ పత్రాలను లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోజ్జు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతునట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం గృహ జ్యోతి పథకంలో ప్రతి మహిళకు రూ.500 గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేకపోవడంతో ఇంకా కొందరు రైతులకు రైతు రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. అనంతరం మాజీ మార్కెట్ చైర్మన్ కడర్ల గంగానర్సయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయానంద్, మాజీ జెడ్పీటీసీ ఆకుల రాజమణి వెంకగౌడ్, మాజీ ఎంపీటీసీ జంగిలి సరితా శంకర్, మాజీ సర్పంచ్ రాజేందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, నాయకులు గాజుల శ్రీనివాస్, గాజుల గంగన్న, జవీద్, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్ రావు, పంచాయతీ సెక్రటరీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.