- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Serilingampally: అక్రమ నిర్మాణాలకు అడ్డాగా శేరిలింగంపల్లి! అనుమతులు లేకపోయినా గాలిమేడలు
దిశ, శేరిలింగంపల్లి: ప్రభుత్వం మారినా.. అధికారులు మారినా.. అక్రమ అక్రమ కట్టడాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరు సైతం మారడం లేదు. అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా.. టీపీఎస్ అధికారులు ఎందుకో లైట్ తీసుకుంటున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ.. ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు.. మనం చేసే పని చేసుకుందాం’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతూ వందల సంఖ్యలో నూతన భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఉన్న స్థలానికి, కడుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. స్థలం తక్కువైనా సెల్లార్లు తవ్వి 7, 8 అంతస్థుల నిర్మాణానికి ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఇల్లీగల్‌గా కట్టుకుంటే పొయేది ఏముంది పోనీలే.. మాకు వచ్చేది మాకు వస్తుందిగా అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎవరికేం పోయేది లేకున్నా జీహెచ్ఎంసీ మాత్రం భారీగా తన ఆదాయాన్ని కోల్పోతోంది.
అక్రమాలు అనేకం..
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా పూర్తవుతున్నాయి. పర్మిషన్లు ఉన్నాయా.. లేదా..? అసలు అనుమతి కోసం జీహెచ్ఎంసీలో అప్లై చేసుకున్నారా.. వారు అనుమతులు ఇచ్చారా అనే ప్రశ్నలకే తావులేకుండా యథేచ్ఛగా కట్టేస్తున్నారు. ఆవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది వెళ్లినా చూసీచూడనట్టుగా వ్యవహరించడం, అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండడంతో ఈ తరహా నిర్మాణాలకు మరింతగా ఊతమిస్తున్నట్లుగా తయారైంది. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో అనేక నిర్మాణాలు సాగుతున్నా పర్మిషన్లు మాత్రం కొన్నింటికే ఉన్నాయని తెలుస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం ఉలుకు పలుకు లేకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి పడుతుంది అని తెలిసినా ఏ లాభాపేక్ష కోసం సిబ్బంది అక్రమార్కులకు వంత పాడుతున్నారో అందరికీ తెలిసిందే.
అక్కడ అన్ని గాలిమేడలే..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, సీజేఆర్ స్కూల్ ఏరియాలతో పాటు పలు కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్క నిర్మాణానికి కూడా అనుమతులు లేవు. అయినా, నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇప్పటికి దాదాపు 200ల వరకు కొత్త కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు బిల్డర్లు, నిర్మాణదారులు ఏకంగా 7, 8 అంతస్తుల భవనాలు నిర్మించారు. అదీగాక పైన పెంట్ హౌస్‌లు కూడా కట్టారు. వీటిలో ఎక్కడా కనీస నిబంధనలు కూడా పాటించ లేదు. అన్నీ తెలిసి సంబంధిత అధికారులు మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. జీహెచ్ఎంసీలో పర్మిషన్ల విషయంలో కొనసాగుతున్న సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమ భవన నిర్మాణదారులు జోరుగా బహుళ అంతస్థుల భవనాలు కట్టేస్తున్నారు.
వారికి నిబంధనలు వర్తించవు..
జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు సాగించినా ఒకే రూల్ ఉంటుంది. వారు నిర్దేశించిన కొలతల ప్రకారమే నిర్మాణాలు సాగించాలి. కానీ, మాదాపూర్ డివిజన్‌లోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, ఖానామెట్ ప్రాంతాల్లో మాత్రం అవేవీ ఉండవు. ఇక్కడ కొందరు బిల్డర్లు, నిర్మాణదారులదే ఇష్టా రాజ్యం. వారికి ఎంతస్థలం ఉంది, దానికి పర్మిషన్లు ఏమున్నాయి అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఎన్ని అంతస్థులు కట్టుకోవాలి అనుకుంటే అన్ని కట్టేస్తున్నారు. పైగా పెంట్ హౌస్ ఉంటే ఖర్చుల కింద పనికి వస్తాయన్న ఆలోచనతో అక్రమ నిర్మాణాలపై పెంట్ హౌస్ కట్టేస్తున్నారు. ఇదంతా తెలిసినా.. జీహెచ్ఎంసీ సిబ్బంది కాసుల వేటలో వారి కళ్లకు ఇవేమీ కనబడడం లేదు.
Serilingampally: అక్రమ నిర్మాణాలకు అడ్డాగా శేరిలింగంపల్లి! అనుమతులు లేకపోయినా గాలిమేడలుచందానగర్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు చైన్‌మెన్లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వారు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనేది కూడా రికార్డులు కూడా ఈ మధ్యకాలంలో బయటకు రావడం వారి అవినీతికి అద్దం పడుతోంది. మాదాపూర్‌లోని కొందరు బిల్డర్లకు వీరు కొమ్ముకాస్తున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. తాజాగా, ఎన్ కన్వెన్షన్‌కు ఆపోజిట్‌లో తమ్మిడికుంటకు బఫర్ జోన్‌లో శరత్ అనే బిల్డర్ ఇల్లీగల్‌గా నిర్మాణాలు సాగిస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు వారికి వంత పాడుతున్నారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ చందానగర్ సర్కిల్ చైన్‌మెన్ల గూర్చి ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. శరత్ మాత్రమే కాదు.. మాదాపూర్‌లో చాలామంది బిల్డర్లకు చందానగర్ జీహెచ్ఎంసీ సిబ్బంది మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.