Trending: అదృష్టం అంటే ఇదేనేమో..! ట్రైన్ కిందపడి ప్రాణాలు కాపాడుకున్న మహిళ (వీడియో)

by Shiva |
Trending: అదృష్టం అంటే ఇదేనేమో..! ట్రైన్ కిందపడి ప్రాణాలు కాపాడుకున్న మహిళ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లకు మొదట గుర్తొచ్చేది రైల్వే ట్రాక్.. ఆ పట్టాలపై నిలబడితే క్షణాల్లో ప్రాణాలు పోవడం పక్కా. కానీ, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఏకంగా గూడ్స్ రైలు కింది పడి ఓ మహిళ వెంట్రుకవాసిలో తన ప్రాణాలను కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో అదే ట్రాక్‌పైకి తాండూరు నుంచి సేడం వైపు వెళ్లే గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో కంగారులో ఆ మహిళ ట్రాక్‌పై పడిపోగా చేసేదేమి లేక తన శరీరాన్ని ఏ మాత్రం కదపకుండా ట్రైన్ వెళ్లేంత వరకు ట్రాక్‌‌పైనే బోర్లా పడుకుంది. రైలు వెళ్లిపోగానే ఆమాంతం పైకి లేచి ఆ మహిళ సమయస్ఫూర్తితో తన ప్రాణాలు కపాడుకుంది. ఈ క్రమంలోనే అక్కడున్న ప్రయాణికులు ఆ మహిళ ధైర్య సాహసాలు చేసి అవాక్కయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1827743304815169869

Next Story

Most Viewed