Congress: నాందేడ్ ఎంపీ వసంత్ రావ్ చవాన్ కన్నుమూత

by Shamantha N |
Congress: నాందేడ్ ఎంపీ వసంత్ రావ్ చవాన్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ రావ్ చవాన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్.. హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (MPCC) ప్రకటించింది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ లో చికిత్ పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. నైగావ్ లో చవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వసంత్ చవాన్ రాజకీయ నేపథ్యం

వసంత్ రావ్ చవాన్ మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు. చవాన్ నైగావ్‌లోని జంతా హై స్కూల్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌ విద్యాసంస్థకు ట్రస్టీ, ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. 1978లో తొలిసారిగా సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2002లో జిల్లా జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. 2021 నుండి 2023 వరకు నాందేడ్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియామకం అయ్యాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంత్ రావు నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీకి చెందిన చిఖ్లికర్ ప్రతాపరావు గోవిందరావుపై 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఆయన మరణం తీరని లోటని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు.

Next Story

Most Viewed