- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనతి కాలంలోనే దిశ ఎంతో ఆదరణ పొందింది: ఎనుముల తిరుపతిరెడ్డి
దిశ, బొంరాస్‌పేట్ : 'దిశ' పత్రిక అతి తక్కువ సమయంలోనే పాఠకులు, ప్రజల విశేష ఆదరణ పొందగలిగినదని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎనుముల తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో 'దిశ '2024 క్యాలెండర్ ను తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రతి గడపకు దిశ పత్రిక వెళ్తుందన్నారు. ప్రజల సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తుందని, ఎప్పటికప్పుడు వార్తలను పాఠకుల ముందు ఉంచుతూ, విశేష ఆదరణ పొందుతూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఎనుముల తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. ఇక ముందు కూడా వినూత్న రీతిలో, సమాజానికి ఉపయోగపడే విధంగా, సమగ్రమైన వార్త కథనాలతో, ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సిములుగౌడ్, రాజేష్ రెడ్డి, జయకృష్ణ, కే. వంశీకృష్ణ నాయక్, ప్రేమ్, లక్ష్మణ్, బొంరాస్ పేట్ మండల దిశ విలేకరి పి.రాఘవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.