క్వాలిటీ తో కూడిన రోడ్లు వేయాలి..: మంత్రి ఉత్తమ్

by Aamani |
క్వాలిటీ తో కూడిన రోడ్లు వేయాలి..: మంత్రి ఉత్తమ్
X

దిశ, నేరేడుచర్ల : హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ద్వారా మంజూరై వేసే రోడ్లలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో రోడ్లు వేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దెబ్బతినే విధంగా కాకుండా కొన్నేళ్లపాటు పని చేసే విధంగా అధికారులు చూడాలని వీటిలో ఎవరు నిర్లక్ష్యం వహించిన సహించేది లేదని అన్నారు. క్వాలిటీ పాటించకుండా రోడ్లు వేస్తే రోడ్లు వేసిన కాంట్రాక్టర్ లైసెన్సులను రద్దు చేస్తామని.. అలాగే సంబంధించిన అధికారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ‌ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల అలాగే మున్సిపలిటీ లో తాగునీటి కోసం అమృత పథకం ద్వారా మంజూరై చేపట్టబోయే 60 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఎక్కడ ఉన్న నిరంతరం హుజూర్నగర్ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పరచాలి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో సంకల్పంతో పని చేస్తున్నాయని అన్నారు. గెలిచిన 11 నెలల్లోనే 10 ఏళ్ల కంటే పది రెట్లు ఎక్కువ పని చేశానని అన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వారు చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని అన్నారు. గతంలో హుజూర్నగర్ డిగ్రీ కాలేజీ తన హయాంలోని ఏర్పాటు చేశానని అప్పటినుండి కాలేజీ ఏ విధంగా అభివృద్ధి జరగలేదని ఇలాంటి సౌకర్యాలు లేవని గత పది నెలలుగా డిగ్రీ కాలేజీ తో పాటు జూనియర్ కాలేజీ కూడా రెండు మూడు సార్లు ఆ కాలేజీకి వెళ్లి పరిశీలించానని అన్నారు. గవర్నమెంట్ కాలేజ్ ని పూర్తిగా అభివృద్ధి చేయిస్తానని అన్నారు. గడ్డి పల్లి గ్రామంలో 25 ఎకరాల స్థలంలో 300 కోట్లతో ప్రపంచ స్థాయిలో ఇంగ్లీష్ స్కూల్ మంజూరు చేయించానని అన్నారు.

రబీ పంటకు రైతుబంధు అందిస్తామని తెలిపారు. లిఫ్టుల మరమ్మతు విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న రైతులు తమకు నేరుగా చెప్పుకోవచ్చునని అలాగే అధికారులు దృష్టి కూడా తీసుకు వెళ్ళవచ్చునని రైతులకు మంత్రి సూచించారు. లిఫ్ట్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఏ లిఫ్టు రిపేరు అయినా 15 నుండి 20 రోజుల వరకు మరమ్మతులు చేసి రైతులకు నీరు అందించాలని ఇందులో ఏ అధికారి నిర్లక్ష్యం వహించిన ఆయనను తీసేస్తానని అన్నారు. అవసరం ఉన్నచోట కొత్త లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ప్రతి ఎకరానికి నీరందిస్తామని అన్నారు. నేను మంత్రి అయిన తర్వాతనే సాగర్ రెండు సార్లు నుంచి రైతులు మంచి పంటలు పండించుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే 153 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా సన్నలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో ధాన్యం అమ్ముకునే రైతులకు 3 రోజుల్లోనే రైతుల ఖాతాలోకి మద్దతు ధరతో పాటు వేగంగా బోనస్ అందిస్తున్నామని తెలిపారు.ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.రూ.10 లక్షల వరకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ట్రీట్మెంట్ అందిస్తున్నామని అన్నారు.

కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అందిస్తామన్నారు.బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు కుల గణన చేస్తున్నామని ఇప్పటికే 90 శాతం పూర్తయిందని మరో 10 రోజులలో పూర్తిస్థాయి అవుతుందని అన్నారు.సుప్రీంకోర్టు అనుగుణంగా ఎస్సీ విభజన చేపడుతున్నామని ప్రకటించారు. సామాజిక న్యాయం అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయని ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామారావు మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అలక సరిత సైదిరెడ్డి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కొనతం చిన్న వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి కౌన్సిలర్లు జితేందర్ రెడ్డి నాగయ్య లలిత జిల్లా నాయకులు సందీప్ రెడ్డి మోతిలాల్ గోపాల్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed