- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వస్తున్నాం.. మీ కోసం.. విద్యార్దుల భవిషత్తుకై స్టూడెంట్స్ ఇంటికే టీచర్లు..
దిశ,డోర్నకల్ : కాలం అతితమౌతుంది.! మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించాలనే తపన టీచర్లలో ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ నూతనంగా తీసుకోవచ్చిన వేకప్ కాల్స్ (ఉదయాన్నే విద్యార్దులను ఫోన్ కాల్స్ ద్వారా నిద్రలేపి) సమర్థవంతంగా నిర్వహించేందుకు తాము నిద్ర లేచి విద్యార్దులను నిద్ర లేపుతున్నారు. ఉదయం 5 గంటలకు ఫోన్ ద్వారా వారిని నిద్ర లేపేందుకు వేకప్ కాల్స్ చేస్తున్నారు. ఇంతే కాకుండా సాయంత్రం స్కూల్ సమయం అనంతరం విద్యార్దుల ఇంటి వద్ద కు చేరుతున్నారు.
అక్కడ విద్యార్ది ఏం చేస్తున్నాడు.. ఎలా చదువుతున్నాడు.. అనే విషయాన్ని వారి తల్లిదండ్రులు,కుటుంబ సభ్యలతో వాకబు చేస్తున్నారు. చదువుకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ఈ నూతన విధానానికి నాంది పలికారు డోర్నకల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ టీచర్లు. ఇందుకోసం గత నాలుగు రోజులగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటి బాట పట్టారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నివాసం ఉంటున్న విద్యార్థుల ఇండ్లను జల్లడపడుతున్నారు. స్టూడెంట్స్ ఇంటికి చేరుకుంటున్నా టీచర్లు వారి తల్లిదండ్రులతో అక్కడే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థి చదువు కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. వారి భవిష్యత్తుపై దిశ నిర్దేశం చేస్తున్నారు.
విద్యార్థులు ఇంటి వద్ద ఏం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు.. స్టూడెంట్ చదువు పట్ల తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు..అనే విషయంపై తల్లిదండ్రులతో ఆరా తీసేందుకు టీచర్లు విద్యార్థుల ఇంటిదారి పట్టారు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల టీచర్లు పేరెంట్స్ తో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థి చదువు, క్రమశిక్షణ, విద్యాసక్తి,హాజరుతో పాటు మార్కులు పై చర్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు తల్లిదండ్రులు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కి హాజరు కావడం లేదు. ఇది గమనించిన డోర్నకల్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు బండి నరసింహా రావు విద్యార్థి తో పాటు తల్లిదండ్రులు,టీచర్ల మధ్య ఏర్పడే గ్యాప్ నివారించేందుకు టీచర్లు ఇంటి వద్దకు వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులతో చదువుపై చర్చించాలని భావించారు.
స్కూల్ లోని సహచర టీచర్లలతో కలిసి సాయకాలం పాఠశాల సమయ అనంతరం వాహానాలను సమకూర్చుకొని మండలంలోని వివిద గ్రామాల్లో నివాసముంటున్న విద్యార్థుల ఇంటికి చేరి చర్చించాలని, స్కూల్ కు రానీ విద్యార్దులను బడి బాట పట్టించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన చేసి టీచర్ల ను గృప్ లుగా విద్యార్దుల ఇంటి చేరుకున్నారు. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో మమేకమై విద్యాప్రమాణాలు,విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులతో అనేక విషయాలను చర్చిస్తున్నారు. ఇందులో విద్యార్థి హాజరు,బాధ్యత,నడవడిక,చదువు కోసం ఇంటికి వద్ద ఉన్న సౌకర్యలు,అసౌకర్యాల గురించి చర్చిస్తున్నారు.
ప్రభుత్వం అందించే పథకాలను,ఫలాలను,ఉన్నత చదువుల కోసం కల్పిస్తున్న చేయూతను వివరిస్తూ వారి భవిష్యత్తును దిశ నిర్దేశం చేస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు పాస్ కావ్వాలంటే తీసుకోవాల్సిన చర్యలను మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇకమీదట జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో తప్పక హాజరై విద్యార్థులకు ఆసరుగా ఉండాలని తల్లిదండ్రులను సూచిస్తున్నారు.టీచర్లే తమ ఇంటికి చేరుకొని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో మాట్లాడడం విద్యార్థికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. తమ భవిష్యత్తు పట్ల టీచర్లు చూపిస్తున్న ఆదరణను ఆసరాగా చేసుకుని ఉదయం టీచర్లు చేసే వేకప్ కాల్స్ కు అనుగుణంగా ఉదయాన్నే లేచి పుస్తకాల్లోని సబ్జెక్టును తమ మనసులో నిక్షిప్తమైన చేసుకోవాలని విద్యార్థులు నూతన కాంక్షను ఇమ్మడించుకుంటున్నారు.
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయిస్తున్నాం : బండి నర్సింహా రావు.
రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు వేకప్ కాల్స్ లను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఈ ఏడాది 87 మంది విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. ఉదయాన్నే ఫోన్ ద్వారా నిద్ర లేపి సుమారు రెండు గంటలు ఇంటివద్దే చదువుకునేలా వారిని సిద్ధం చేస్తున్నాం. స్కూల్ లో ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా సాయంకాలం ఇంటికి చేరిన విద్యార్దులు సెల్ఫోన్ లకు దూరంగా ఉంటూ చదువు కొనసాగించాలని ఆదేశిస్తూ ఎంత మేరకు టీచర్ల సూచనలు పాటిస్తున్నారో ఇంటి వద్దకు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చిస్తున్నాం. తద్వారా విద్యార్థి ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా విద్యకే కేటాయించేలా మలచడంలో సక్సెస్ అవుతున్నాం.
టీచర్లు శ్రమకు రుణపడి ఉంటాం : బక్కతట్ల ఉష
మా ఉన్నత భవిష్యత్తు కోసం టీచర్లు పడే శ్రమకు సదా రుణపడి ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ చూపుతు ఉదయాన్నే ఫోన్ చేసి చదువుకోవాలని సూచిస్తున్నారు. సాయంకాలం ప్రత్యక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి అమ్మనాన్నలతో మాట్లాడి ఈ మూడు నెలలు ఎటువంటి పనులు చెప్పకుండ కేవలం చదువుకునేలా అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీచర్ల ఆశయాలకు అనుగుణంగా చదువుకుని మంచి మార్కులు సాధిస్తామని తెలుపుతున్నాం.