Duddilla: సమ్మిళిత అభివృద్ధి కోసమే ప్రభుత్వం కృషి.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

by Ramesh Goud |   ( Updated:2024-11-30 06:58:48.0  )
Duddilla: సమ్మిళిత అభివృద్ధి కోసమే ప్రభుత్వం కృషి.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్: అని వర్గాల సమ్మిళిత అభివృద్ధి(Inclusive Development) కోసమే మా ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఇవాళ హైదరాబాద్(Hyderabad) లోని టీ-హబ్(T-Hub) లో బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(Backward Classes Chamber of Commerce and Industry) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాల పారిశ్రామిక వేత్తల కోసం బిక్కి(Biki) ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకొస్తామని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా పరిశ్రమలు విస్తరించే విధంగా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీ(Best MSME Policy)ని తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకురావడంతో పాటు ఆ విధానాలను ఆచరణలో పెట్టడం కూడా పెద్ద సవాలుగా మారిందని అన్నారు. అన్ని వర్గాల సమ్మిళిత వృద్ది కోసమే మా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అలాగే కులగణన గురించి మాట్లాడుతూ.. రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉపాధి కులాల వారిగా అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని(Caste Census Program) మొదలు పెట్టామని, ఇందులో ఎన్ని సవాళ్లు వచ్చినా ముందుకు వెళతామని మంత్రి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed