- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యక్తి తల పై బండరాళ్లతో దాడి..

దిశ, మీర్ పేట్: ఓ వ్యక్తి తలపై బండరాళ్లతో మోది దారుణంగా గాయపరిచారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి నీ పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...మీర్ పేట్ కు చెందిన విష్ణు అనే వ్యక్తి తల పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బండ రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలై రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు మీర్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మీర్ పేట్ పోలీసులు గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దగ్గర లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ను కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.