- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth : రైతులకు గుడ్‌న్యూస్.. మరో 3 లక్షల మందికి రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Good news for farmers) రైతులకు శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రుణమాఫీ నాలుగో విడత నిధుల విడుదలకు (CM Revanth Reddy) రేవంత్ సర్కార్ రెడీ అయింది. అందుకు కావాల్సిన రూ. 3వేల కోట్లను సిద్ధం చేసినట్లు సమాచారం. మరో 3 లక్షల మందికి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా రైతులకు సీఎం వరాల జల్లు కురిపించనున్నారు. సీఎం ప్రకటన వెంటనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది.
రైతు పండుగ ముగింపు వేడుకల భారీ బహిరంగ సభ మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం మూడు గంటలకు హెలికాఫ్టర్ ద్వారా భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్‌కు సీఎం చేరుకోనున్నారు. నాలుగు గంటలకు మహాసభ వేదికగా రైతులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం హామీల వర్షం కురిపించనున్నారు. ఏడాది పాలనపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు సభా వేదికగా సీఎం ధీటైన సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.