- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శృంగారం లేకుండా లైఫ్ లేదు.. ఇంటిమేట్ సీన్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజస్వి మదివాడ(Tejaswi Madiwada), శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’(Life is beautiful) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ చిత్రం సక్సెస్ కావడంతో తేజస్వికి ఏకంగా మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో ఆఫర్ వచ్చింది. ఇక ఈ చిత్రంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆర్జీవీ ‘ఐస్ క్రీమ్’(Ice cream) అనే బోల్డ్ మూవీని తేజస్విని పెట్టి తీశారు.
ఆ తర్వాత ఈ అమ్మడు బిగ్‌బాస్ షో(Bigg Boss Show)లోనూ పాల్గొని తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. గత కొద్ది రోజుల నుంచి తేజస్వి వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ముద్దు సీన్లు చేసేటప్పుడు 10 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ రావు. అయినప్పటికీ కిస్సింగ్, బోల్డ్ వంటి సీన్స్ చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.
కొంతమంది ఆర్టిస్టులకు ఇలాంటివి కామన్. అయితే మనమందరం సెక్స్ వల్లనే పుట్టిన వాళ్లం. శృంగారం లేకుండా లైఫ్ లేదు. పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుడతాము. కానీ నేకెడ్‌గా ఉండడానికి ఎందుకు ఆలోచిస్తామో అర్థం కాదు. చిన్నప్పుడు టీవీలలో కిస్సింగ్ సీన్స్ వస్తే పేరెంట్స్ కళ్లు మూసేవారు. కొంతమంది అయితే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే వారు. ఇలా చేసినప్పుడు పిల్లల్లో కుతూహలం ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి అలాంటివి అలవాటు చేస్తే ఎలాంటి పీలింగ్స్ ఉండవని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తేజస్వి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.