- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె దవాఖానాలో పవర్ కట్.. రెండేళ్లుగా విద్యుత్ సరఫరా నిలిపివేత.
దిశ,సంస్థాన్ నారాయణపురం : ప్రజలకు వైద్యం అందించే పల్లె దవాఖానాలో గత రెండేళ్లుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్యమైన వైద్యం అందించాలని గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పల్లె దవాఖానాలు విద్యుత్ బిల్లులు చెల్లించలేదంటూ రెండు సంవత్సరాలుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆరుబయటే చెట్ల కింద వైద్యం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వాయిళ్లపల్లి గ్రామంలోని పల్లె దవాఖానలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరుబయట ఉన్న చెట్ల కింద వైద్యాన్ని అందజేస్తున్నారు.దీంతో ఇక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైద్యానికి రావాలంటే భయపడుతున్న ప్రజలు..
ఆరోగ్యం బాగాలేక ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చే రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చికిత్స విషయం దేవుడెరుగు కానీ ఇక్కడికి వచ్చిన వారికి మళ్లీ కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చెట్లపైనుండి పురుగులు,చీమలు పడుతుండడంతో దద్దుర్లు వస్తున్నాయని,అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది దోమల బారిన పడి డెంగ్యూ జబ్బును కూడా తెచ్చుకున్నామని దిశతో తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి పల్లె దవాఖానకు విద్యుత్ పునరుద్దరణ చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.
పాక్షికంగా బిల్లు చెల్లించిన కనేక్షన్ పునరుద్ధరిస్తాం: విద్యుత్ శాఖ ఏఈ.
పల్లె దవాఖాన విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతోనే విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరిగింది. పాక్షికంగా విద్యుత్ బిల్లు చెల్లించిన కనెక్షన్ పునరుద్ధరిస్తాం.