- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మనిషి అనుకున్నా.. రూ.50 వేల కోసం మోసం చేశాడంటూ రవి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: తెలుగు స్టార్ యాంకర్ రవి (Ravi)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘సమ్‌థింగ్ స్పెషల్’(Something Special) అనే షోతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించాడు. ఆ తర్వాత లాస్య(Lasya)కు జోడిగా ఎన్నో షోస్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రవి పేరు తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పలు చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేసి అలరించారు. అంతేకాకుండా బిగ్‌బాస్ సీజన్-5(Bigg Boss Season-5)లోనూ పాల్గొని కానీ విన్నర్ కాలేయపోయాడు.
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘నా వస్తువులన్నీ నా కారులోనే పెట్టేవాడిని. ఒకరోజు నా అసిస్టెంట్ రాకపోవడంతో నా మనిషి అనుకొని నాకు తెలిసిన ఓ అబ్బాయిని రమ్మని చెప్పాను. అయితే పెట్రోల్ బంక్ దగ్గర డ్రైవర్‌కు కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్(PIN number) చెప్పేవాడిని. అప్పుడే ఆ అబ్బాయి నోట్ చేసుకున్నాడు. ఓ రోజు ఉదయం రూ. 50 వేలు కట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో నేను కంగారు పడిపోయాను. డ్రైవర్‌ను అడిగితే నాకు ఏమీ తెలియదని చెప్పాడు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. సీసీటీవీ ఫుటేజ్(CCTV footage)లో నేను పిలిచిన అబ్బాయి కనిపించాడు. నమ్మి రమ్మంటే డబ్బుతో విజయనగరం పారిపోయాడు. పోలీసులు రెండు నిమిషాల్లో పట్టుకుంటామన్నారు. కానీ వాడి జీవితం నాశనం చేయడం ఇష్టం లేక నేనే వదిలేశాను’’ అని చెప్పుకొచ్చాడు. రవి ఈ కామెంట్స్ గతంలో చేసినప్పటికీ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.