Ram Charan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నానా హైరానా’ సాంగ్.. సరికొత్త రికార్డు (ట్వీట్)

by Hamsa |
Ram Charan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నానా హైరానా’ సాంగ్.. సరికొత్త రికార్డు (ట్వీట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అంజలి(Anjali), సునీల్, సముద్రఖని, ఎస్ జే సూర్య(S.J. Surya) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ చిత్రం జనవరి 10 న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు.

ఇక ఇటీవల కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడిన ‘నానా హైరానా’ (NaaNaaHyraanaa) సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా, ‘నానా హైరానా’ సాంగ్ సరికొత్త రికార్డును దక్కించుకుంది. ఈ పాట ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టడంతో పాటు ఈ సంవత్సరంలో అతిపెద్ద మెలోడీ సాంగ్‌(Melody song)గా నిలిచింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ట్రెండింగ్ 1లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed