- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Puri Jagannath: మ్యూజింగ్స్ వేదికన ‘ప్లాన్-A, B, C, K’ అంశాలపై మాట్లాడిన పూరి జగన్నాథ్..!!
దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఎప్పుడూ మనం ఊహించిన విధంగా ఉండదంటూ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Director Puri Jagannath) మ్యూజింగ్స్(Musings) వేదికగా ప్లాన్-ఎ(Plan-A), ప్లాన్-బి, కె(Plan-B, K) గురించి మాట్లాడారు. మనం అనుకున్నట్లు జరగవని.. ఎవరి జీవితం ఎవరి చేతుల్లో ఉండదని తెలిపారు. కాగా ప్లాన్- బిను ఫాలో అవ్వాలని అన్నారు. ఇది ఒక బ్యాకప్ స్ట్రాటజీ అని పేర్కొన్నారు. మనకు ఒక దారి మూసుకుపోయినట్లైతే.. వేరే దారిని వెతుక్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. దీంతో స్ట్రెస్(Stress), ఆందోళన చాలా వరకు తగ్గుతుందని వెల్లడించారు.
ప్లాన్ ఎ సక్సెస్ కానప్పుడు.. ప్లాన్ -బి ఎంతో ఉపయోగపడుతుందని.. అనేక లాభాలున్నానని అన్నారు. ఏదైనా అనుకున్నది జరగకపోతే.. మరో దారిన వెళ్లాలని.. మార్గాలన్నీ తెలిస్తే కను నీవు ఎప్పుడూ నిరాశకు గురి కావని పేర్కొన్నారు. ముందుగా మనకు నెగిటివ్ ఆలోచనలు రావొద్దని.. వచ్చినా వెంటనే వాటికి చెక్ పెట్టాలని అన్నారు. నెగిటివ్ ఆలోచనలు మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వవని తెలిపారు.
ఒకవేళ ప్లాన్- బి ఫెయిల్ అయితే ప్లాన్ సి కు వెళ్లండని సలహా ఇచ్చారు. అనుకున్న గమ్యానికి వెళ్లాలనుకుంటే ప్రణాళికలు ఎన్నైనా వేసుకోవాల్సిందేనని అన్నారు. కొన్నిసార్లు లేట్ అవ్వొచ్చు.. కానీ దేనికి కుంగిపోవద్దని తెలిపారు. ఈ ఒక్కటి అర్థం అయితే ఏ వ్యక్తి డిప్రెషన్‌కు లోనవ్వడని వెల్లడించార. ‘కాలు విరిగితే కుంటుకుంటూ పోదాం. వర్షం వస్తే తడుచుకుంటూ పోదాం’ అంటూ చాలా చక్కగా వివరించారు.
మన ఎమోషన్ ఎప్పుడైనా సరే తుది గమ్యం వైపే ఉండాలని అన్నారు. అన్ని ప్లాన్స్ మూసుకుపోతే ప్లాన్- కె ఉందన్నారు. కె అంటే కిటికీ అని వెల్లడించారు. మనం వెతికితే ఎక్కడో ఒక దగ్గర కిటికీ దొరుకుందని.. అది చాలండీ దూకేయడానికి అని పేర్కొన్నారు. ఈ ప్లాన్స్ కన్నా మీ మానసిక స్థిరత్వం అనేది మోస్ట్ పవర్‌పుల్ అని గుర్తుపెట్టుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించారు.