ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతా..: మంత్రి ఉత్తమ్

by Aamani |
ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ  కళాశాలను తీర్చిదిద్దుతా..: మంత్రి ఉత్తమ్
X

దిశ, హుజూర్ నగర్ : హుజుర్ నగర్ నియోజకవర్గన్నీ రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గంలో విద్య, వైద్యం, కరెంట్ తో సహా అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . డిగ్రీ కళాశాలలో నూతన క్లాస్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ సహా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని నా ఆకాంక్ష అని అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలను మంత్రి సందర్శించారు.ప్రైవేట్ కు ధీటుగా హుజుర్ నగర్ డిగ్రీ కళాశాలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.నిరుపేదలకు విద్య అతి ముఖ్యమైనది.మంచి విద్యను అందిస్తే జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరాలన్నదే తన కోరికని మంత్రి అన్నారు.త్వరలో డిగ్రీ కళాశాల అభివృద్ధి కొరకు ఎస్టిమేట్ అందిస్తే ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు.

డిగ్రీ, జూనియర్ కళాశాలలో కాలేజ్ లలో అన్ని గ్రూప్ లలో టాపర్ లకు గోల్డ్ మెడల్ అందిస్తామని అన్నారు.కాలేజి లో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి,బాయ్స్, గర్ల్స్ కొరకు సెపరేట్ టాయిలెట్ లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.గ్రౌండ్ లో మంచి స్టేడియం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించి విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేయాలనీనిరుపేద పిల్లలకు మంచి విద్య ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆర్డీవో శ్రీనివాసులు మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ డిగ్రీ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ రామారావు జానయ్య అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed