Tiger: టైగర్.. టెన్షన్..! 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఫారెస్ట్ అధికారులు

by Shiva |   ( Updated:2024-11-30 03:48:39.0  )
Tiger: టైగర్.. టెన్షన్..! 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఫారెస్ట్ అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా (Komuram Bheem Asifabad District) కాగజ్‌నగర్ (Kagaznagar) మండల పరిధిలో ఇంకా పులి భయం వీడలేదు. శుక్రవారం బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం (Gannaram) గ్రామానికి చెందిన లక్ష్మి (Lakshmi) అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లగా ఆమెపై పులి దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు (Forest Officials) మొత్తం 15 గ్రామాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, ప్రాంతాల్లో పులి సంచరిస్తన్నట్లుగా వారు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారు పొలం పనులకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed